క్రిస్మస్ ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి
యేసు క్రీస్తు జన్మదినోత్సవమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం అన్నారు.
దిశ,మేడ్చల్ బ్యూరో : యేసు క్రీస్తు జన్మదినోత్సవమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం అన్నారు. బుధవారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
జీసస్ జన్మదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం కలిగి ఉండటమే యేసుక్రీస్తు అందరికీ ప్రబోధించారని తెలిపారు.