గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్ 'గ్యాప్'తో రిలయన్స్ రిటైల్ ఒప్పందం!

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గ్యాప్ కంపెనీతో దేశీయ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సంస్థ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Update: 2022-07-06 15:38 GMT

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గ్యాప్ కంపెనీతో దేశీయ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సంస్థ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా గ్యాప్ బ్రాండ్ ఉత్పత్తులను దేశీయ రిటైల్ మార్కెట్లో అధికారికంగా రిలయన్స్ రిటైల్ విక్రయించనుంది. సంస్థకు చెందిన స్టోర్, మల్టీ-బ్రాండ్ స్టోర్లు, డిజిటల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో గ్యాప్ ఉత్పత్తులు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా గ్యాప్ బ్రాండ్ దేశీయంగా మెరుగైన విక్రయాలను సాధిస్తుందని, అలాగే, రిలయన్స్ రిటైల్ సంస్థకు స్థానిక తయారీ, నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలవుతుందని కంపెనీ వివరించింది.

గ్యాప్ బ్రాండ్ 1969లో స్థాపించబడింది. ఆన్‌లైన్‌తో పాటు అంతర్జాతీయంగా కంపెనీ సొంత స్టోర్లతో పాటు ఫ్రాంచైజ్ రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన రిలయన్స్ రిటైల్ సీఈఓ అఖిలేష్ ప్రసాద్, రిలయన్స్, గ్యాప్ కలిసి దేశీయ వినియోగదారులకు గ్లోబల్ బ్రాండ్‌ను మరింత చేరువ చేయనున్నాయని చెప్పారు. దిగ్గజ రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం మరింత వేగంగా వినియోగదారులకు చేరువ కావడానికి వీలవుతుందని గ్యాప్ కంపెనీ గ్లోబల్ హోల్‌సేల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆడ్రియన్ గెర్నాండ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News