మోటర్‌ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఏసీపీ సారంగపాణి

దిశ, ధర్మారం: మోటర్‌ వాహన చట్టాన్ని - Ramagundam ACP Sarangpani said strict action would be taken against those violating the Motor Vehicle Act

Update: 2022-03-25 17:03 GMT

దిశ, ధర్మారం: మోటర్‌ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం ఏసీపీ సారంగపాణి అన్నారు. ధర్మారం పోలీసులతో కలిసి ఆయన స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగ రోడ్డుపై వెళ్తున్న వాహనాలు చెక్‌ చేసి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటారని ప్రజలంతా సహకరించాలని కోరారు. ధర్మారంలోని ప్రధాన కూడలిలో వాహన తనిఖీలో భాగంగా వెకిల్స్‌పై ఉన్న పెండింగ్‌ చలాన్స్ అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపించారు.


పెండిరగ్‌ చలాన్స్ పై ప్రభుత్వం రాయితి ఇచ్చిందని ఈ నెల 31 లోపు ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. త్రిపుల్‌ రైడిరగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, రాష్‌ డ్రైవింగ్‌ ఎవరు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలానే మైనర్స్‌కి ఎవరు వాహానాలు ఇచ్చిన వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. కార్లకు కూడ డార్క్‌ ఫిలిం వేస్తె ప్రమాదాలు జరిగె అవకాశం ఉందని, ఫిలిం ఉన్న కార్లను ఆపి అప్పటికప్పుడు డార్క్‌ ఫిలింమ్స్‌ తొలగించారు ఎసిపి.


ధర్మారం రోడ్డు చాలా విశాలమైందని, కొందరు దుకాణదారులు వారి వారి సామగ్రిని రోడ్డుపై పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వాటిని తొలగించారు. ఎవరైన రోడ్డుపై వాహనాలు పార్క్‌ చేసిన కఠిన చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో పెద్దపల్లి సి.ఐ. ప్రదీప్‌ కుమార్‌, ట్రాపిక్‌ సిఐ అనిల్‌ కుమార్‌, ధర్మారం ఎస్‌.ఐ. శ్రీనివాస్‌, ఎస్‌.ఐ అశ్విని, పెద్దపల్లి ఎస్‌.ఐ మౌనిక తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News