Ram Pothineni: ఇట్స్ అఫీషియల్.. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) తన 22వ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు.

Update: 2024-10-13 09:32 GMT

దిశ, సినిమా: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) తన 22వ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అయితే RAPO22  చిత్రానికి మహేష్ బాబు పచ్చి గొల్ల (Mahesh Babu Pachigolla)దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యెర్నేని, వై రవి శంకర్ (Ravi Shankar)ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఇన్నాళ్లు యాక్షన్-ఓరియెంటెడ్ పాత్రలతో అలరించిన రామ్ ఈ మూవీలో ఓ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని సమాచారం. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు కూడా త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.

Tags:    

Similar News