న్యూ లుక్‌లో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న ఫొటో
దిశ, సినిమా : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫొటో ఒకటి ప్రస్తుతం ..telugu latest news
దిశ, సినిమా : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చెరువు పక్కన పంచె కట్టులో సైకిల్‌పైన వెళ్తున్న చరణ్.. అచ్చం పల్లెటూరి వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఈ న్యూ లుక్‌లో చెర్రీని చూసిన అభిమానులు ఈ పిక్ ఎక్కడిదని ఆశ్చర్యపోతున్నారు. అయితే చరణ్- శంకర్ కాంబినేషన్‌లో ప్రస్తుతం #RC15 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో తను ప్రభుత్వ ఉద్యోగిలా కనిపించే అవకాశాలున్నాయని మొదటి నుంచి చెప్తున్నారు. దీంతో ఆలోచనలోపడ్డ అభిమానులు.. శంకర్ గత చిత్రాల ఫ్లాష్ బ్యాక్ సీన్లతో పోల్చుకుంటున్నారు. 'భారతీయుడు, జెంటిల్‌మ్యాన్' చిత్రాల మాదిరే #RC15లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని, ఇది 1930 నాటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని ఊహిస్తున్నారు. అంతేకాదు ఇందులో చెర్రీ ఓ పొలిటికల్ లీడర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే జరగగా.. ఈ ఫొటో ఆ సెట్స్‌లో తీసిందేనని భావిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.