తొందరగా వెయిట్ లాస్ అవుతున్నారా.. ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలోని మెయిన్ పార్ట్ పాడైనట్లే

ప్రస్తుత రోజుల్లో జీవన శైలిలో మార్పులు కారణంగా శరీర బరువు(body weight) పెరుగుతున్నారు.

Update: 2024-12-22 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జీవన శైలిలో మార్పులు కారణంగా శరీర బరువు(body weight) పెరుగుతున్నారు. తర్వాత వెయిట్ లాస్ అయ్యేందుకు వర్కౌట్స్(workouts) చేయడం, ఇంట్లోనే పలు చిట్కాలు ఫాలో అవ్వడం, న్యూట్రిషియన్లు(Nutrients) సలహాలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. తక్కువ టైంలోనే బరువు తగ్గి స్లిమ్‌గా అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యేవారి కిడ్నీ(kidney)పై ప్రభావం చూపుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ముఖ్య పాత్ర పోషించే కిడ్నీల పనితీరు మందగిస్తే బాడీ మొత్తానికి ప్రమాదమే. కిడ్నీ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే హైబీపీ(High BP), డయాబెటిస్(Diabetes) వంటి వ్యాధులు తలెత్తుతాయి. కిడ్నీల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే బతకడం కూడా కష్టమే. కాగా ప్రాథమిక దశలోనే సమస్యను గుర్తించి.. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మేలు.

మీరు డైట్ ఫాలో అవుతున్నప్పుడు మూత్రం కలర్(urine) మారినా, కిడ్నీలు ఉండే ప్లేస్‌లో పెయిన్ రావడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది కిడ్నీ సమస్య అని గ్రహించాలి. కిడ్నీలు తీవ్రంగా పాడైతేనే నాలుక రుచి మందగిస్తుంది. ఆకలి వేయదని నిపుణులు చెబుతున్నారు. అలాగే వికారం, వాంతులు అవుతాయి. బాడీలోని వ్యర్థాలు పేరుకుపోయి.. కాళ్లు, ముఖం ఉబ్బినట్లుగా కనిపించడం, ఆక్సిజన్ లెవల్స్ తగ్గడం.. దీంతో శ్వాస సంబంధిత వ్యాధులు(Respiratory diseases) తలెత్తడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గడం(Decreased production of red blood cells), తరచూ తలనొప్పి(headache) రావడం, మెమోరీ లాస్(Memory loss), ఏ పని మీద శ్రద్ధ పెట్టకపోవడం వంటి సమస్యలు చుట్టుముడుతాయి. కిడ్నీల ఆరోగ్యమే శరీర మొత్తం ఆరోగ్యం కాబట్టి ఈ ఆహారం తీసుకోండని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే బాడీని డీహైడ్రేషన్‌(Dehydration)కు గురి కానివ్వకుండా.. రోజూ తగినంత వాటర్(Water) తీసుకోవాలి. వెల్లుల్లి(garlic)ని ఆహారంలో భాగం చేసుకోవాలి. వెల్లుల్లి రక్తాన్ని శుద్ధి చేయడంలో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) అధికంగా ఉండే యాపిల్స్(Apples) తినండి. విటమిన్ బి, డి పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు(Mushrooms) తీసుకోండి. ఇవి కిడ్నీ జబ్బులకు చెక్ పెడతాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్(Immunity power) పెరుగడమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అలాగే శరీరంలో ఉండే టాక్సిన్ల(toxins)ను బయటకు పంపేందుకు కాలిఫ్లవర్‌(Cauliflower)లో ఉండే పొటాషియం(Potassium), సల్ఫర్(Sulphur) ఉపయోగపడతాయి. కిడ్నీల పని తీరు కూడా మెరుగుపడుతుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News