పన్ను చెల్లింపులో Rajinikanth, Akshay Kumar రికార్డు
Rajinikanth, Akshay Kumar among highest taxpayers in film industry| చెన్నైలో ఇన్‌కమ్ టాక్స్ డే ఘనంగా నిర్వహించారు అధికారులు. తెలంగాణ గవర్నర్ తమిళి సై ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమంలో అత్యధిక టాక్స్ చెల్లించిన వారికి అవార్డులు అందించారు. అత్యధిక పన్ను
దిశ, సినిమా: Rajinikanth, Akshay Kumar among highest taxpayers in film industry| చెన్నైలో ఇన్‌కమ్ టాక్స్ డే ఘనంగా నిర్వహించారు అధికారులు. తెలంగాణ గవర్నర్ తమిళి సై ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమంలో అత్యధిక టాక్స్ చెల్లించిన వారికి అవార్డులు అందించారు. అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా రజనీకాంత్ ఉండటంతో ఆయన తరపున కూతురు ఐశ్వర్య ఈ పురస్కారాన్ని స్వీకరించింది.
ఇక బాలీవుడ్‌లో అత్యధిక పన్ను చెల్లించిన అక్షయ్ కుమార్‌ను అభినందించిన ఐటీ శాఖ.. ప్రశంసా పత్రాన్ని అందించింది. కాగా అక్షయ్ ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ స్వీకరిస్తుంటే.. రజినికాంత్ ఏకంగా రూ.100 కోట్లపైనే పారితోషికం తీసుకుంటూ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు.
ఇది కూడా చదవండి: కాలిక్యులేటర్‌తో ఆల్జిబ్రానా.. లాజిక్ చచ్చిపోయిందంటూ జాన్వీపై ట్రోలింగ్