పుదుచ్చేరి విమాన సర్వీసుతో పర్యాటక, వ్యాపార రంగానికి మేలు: గవర్నర్ తమిళిసై
దిశ, శంషాబాద్: పుదుచ్చేరి నుంచి విమాన సర్వీసు పర్యాటక, వ్యాపార రంగానికి మేలు జరుగుతుందని latest telugu news..
దిశ, శంషాబాద్: పుదుచ్చేరి నుంచి విమాన సర్వీసు పర్యాటక, వ్యాపార రంగానికి మేలు జరుగుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ అన్నారు. పుదుచ్చేరి హైదరాబాద్ విమాన సర్వీసులు ప్రారంభించిన గవర్నర్ నేరుగా పుదుచ్చేరి నుంచి మొదటి విమానంలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో గవర్నర్ తమిళి సై కు హారతి పట్టి మహిళలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుదుచ్చేరి నుండి మొదటి విమానంలో హైదరాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత విమాన సర్వీసు ప్రారంభించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పుదుచ్చేరి నుండి వచ్చే వారికి హైదరాబాద్ బిర్యానీతో పాటు హైదరాబాద్‌లో పర్యటించడం ఎంతో సులభంగా ఉంటుంది అన్నారు. హైదరాబాద్ నుండి పుదుచ్చేరి వెళ్లే ప్రయాణికులకు టూరిస్ట్, కల్చరల్, స్పిరిచువల్ కనెక్టివిటీ ఈజీ అవుతుందన్నారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ తో పాటు బెంగళూరు కూడా సర్వీస్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ విమాన సర్వీసుల్లో పర్యాటకంగా వ్యాపార రంగంతో మంచి రిలేషన్ షిప్ ఏర్పడుతుందన్నారు. ఈరోజు నుండి ప్రతిరోజు హైదరాబాద్‌కు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తెలిపారు.