Flax seeds: అవిసె గింజలతో పరాటా తయారీ.. అదిరిపోయే రుచితో పాటు..?

అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Update: 2024-10-20 15:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. స్ట్రోక్, గుండె జబ్బులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి. కాగా అవిసె గింజలతో పరాటా చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మరెన్నో ఉన్నాయి. అవిసె గింజలతో తయారు చేసిన పరాటా తింటే వెయిట్ లాస్ అవుతారు. అలాగే ఊబకాయాన్ని తగ్గించడంలో మేలు చేస్తాయి. అవిసె గింజల్లో ఉండే ఫైబర్ బరువును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల్ని దూరం చేస్తాయి. కాగా అవిసె గింజల పరాటా తయారీ విధానమేలాగో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..

అవిసె గింజలు, బెల్లం తురుము, గోధుమ పిండి, నూనె, పాలు, దేశీ నెయ్యి, సాల్ట్ తీసుకోవాలి.

తయారీ విధానం..

అవిసె గింజల్ని వేయించి.. మిక్సీ పట్టాలి. అవిసె గింజల పొడితో బెల్లం, పాలు వేసి కలపండి. తర్వాత వేరే పాత్రలో గోధుమపిండి, కాస్త ఆయిల్, సాల్ట్ వేసి కలిపి 20 నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని బాల్ గా తయారు చేసి.. దానిలో అవిసె గింజల స్టఫింగ్ పెట్టి.. రౌండ్ గా చుట్టి పాన్ పై నెయ్యి వేసి కాల్చండి. లేత బంగారు కలర్ లో వచ్చే వరకు కాల్చితే అవిసె గింజల పరాటా తయారు అయినట్లే. దీన్ని ఏదైనా చట్నీ లేదా సాస్ తో తింటే రుచి అదిరిపోతుంది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News