Prabhas: పాత రికార్డులన్ని ప్రభాస్ దెబ్బకి పరార్ .. రాజాసాబ్ మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్

రాజాసాబ్ మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్

Update: 2024-10-24 09:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రభాస్ హీరోగా రాజాసాబ్ ( Raja Saab ) మూవీ  తెరకెక్కుతుంది. బుధవారం ప్రభాస్ ( Prabhas ) పుట్టిన రోజు సందర్భంగా రాజాసాబ్ మూవీ నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అయితే, ప్రభాస్ మొదటిసారి తాత గెటప్ లో కనిపించాడు. చూడబోతుంటే ఈ మూవీలో డార్లింగ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే, మూవీ టీం రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. అప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్ని ప్రభాస్ దెబ్బకి పరార్ అయ్యాయి. ఇప్పటి వరకు 6.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మూవీ మేకర్స్ కూడా షాక్ అయ్యే రాజాసాబ్ మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. " బ్రో " మూవీ మోషన్ పోస్టర్ 5.83 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తాజాగా, ఈ మూవీ రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. ప్రభాస్ ఎలాంటి రికార్డులు అయిన ఇట్టే బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News