Prabhas: చిన్న సినిమాకు సపోర్ట్‌గా ప్రభాస్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

అంజన్ రామచంద్ర (Anjan Ramachandra), శ్రావణి రెడ్డి (Shravani Reddy) జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’ (Love Reddy).

Update: 2024-10-20 14:30 GMT

దిశ, సినిమా: అంజన్ రామచంద్ర (Anjan Ramachandra), శ్రావణి రెడ్డి (Shravani Reddy) జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’ (Love Reddy). గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా రిలీజైన ట్రైలర్ (Trailer) కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. పాజిటివ్ అంచనాల మధ్య ‘లవ్ రెడ్డి’ చిత్రం అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సపోర్ట్‌గా నిలవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ మేరకు ప్రభాస్ (Prabhas).. తన ఇన్‌స్టా (Insta) వేదికగా.. ‘‘లవ్ రెడ్డి’ (Love Reddy) సినిమాకు సంబంధించి ఎన్నో మంచి విషయాలు నా దృష్టికి వచ్చాయి. ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో ఈ సినిమా మంచి మూవీగా నిలవడం సంతోషంగా ఉంది’ అని తెలుపుతూ.. ‘లవ్ రెడ్డి’ (Love Reddy) ట్రైలర్ (Trailer) ను ఇన్‌స్టా (Insta) స్టోరీస్‌లో షేర్ చేస్తూ ఈ చిత్రానికి అండగా నిలవాలని ప్రభాస్ కోరారు. ఇక ఇప్పటికే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో 4 స్పాన్సర్ షోలు వేసి ‘లవ్ రెడ్డి’ (Love Reddy) సినిమాకు మద్ధతునివ్వగా.. ఇప్పుడు ప్రభాస్ (Prabhas) కూడా సపోర్ట్ చెయ్యడంతో చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది. అలాగే.. ప్రభాస్ పోస్ట్ చూసిన నెటిజన్లు కూడా డార్లింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Similar News