ఆ సినిమాలే నా కెరీర్‌ను దెబ్బతీశాయ్.. పూజా హెగ్డే
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పూజా హెగ్డే తన కెరీర్‌లో కొన్నిసార్లు లోయెస్ట్ పాయింట్స్‌కు పడిపోయినట్లు అంగీకరిస్తానంటోంది..Latest Telugu News
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పూజా హెగ్డే తన కెరీర్‌లో కొన్నిసార్లు లోయెస్ట్ పాయింట్స్‌కు పడిపోయినట్లు అంగీకరిస్తానంటోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి బాలీవుడ్‌లో మాత్రం ఒక్క హిట్ ఖాతాలో వేసుకోలేక ఐరెన్ లెగ్ ముద్ర వేసుకుంది. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన పూజ.. రణవీర్ సింగ్ సరసన 'సర్కస్'తో డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా గతాన్ని గుర్తుచేసుకుంటూ.. 'నేను ఒక దశలో వరుసగా ఆరు హిట్ చిత్రాలతో అత్యధిక పాయింట్లతో ముందున్నాను. తర్వాత బాలీవుడ్ పరాజయాలతో మళ్లీ అట్టడుగుకు పడిపోయా. ఒక సంవత్సరం సినిమాలు లేక ఖాళీగానే ఉన్నా. దీంతో నా కెరీర్ మొదటి నుంచి ప్రారంభమవుతుందని అర్థం చేసుకున్నా. కానీ, ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకుని భాదపడలేదు. సినిమాలు బాగా ఆడలేదంటే సరైన సబ్జెక్ట్ ఎంచుకోలేదని ఆలోచించాను. ఇంతలోనే తెలుగులో మళ్లీ హిట్ అందుకుని దూసుకుపోతున్నా' అంటూ చెప్పుకొచ్చింది.