ఈవెంట్స్​కు తాత్కాలిక బ్రేక్.. ససేమిరా అంటున్న పోలీసులు​

Update: 2022-04-09 16:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్పెషల్​ ఈవెంట్స్​కు బ్రేక్​ పడింది. రేవ్​ పార్టీలు, పబ్​లు, స్పెషల్​ ఈవెంట్స్​ సమయాల్లో విచ్చలవిడిగా డ్రగ్స్​ వాడుతున్నారనే కారణాలతో వాటన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. స్పెషల్​ ఈవెంట్స్​కు పర్మిషన్​ ఇవ్వడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇటీవల రాడిసన్​ హోటల్​లోని పుడింగ్​ మింక్​ పబ్​ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పబ్​లో విచ్చలవిడిగా డ్రగ్స్​ వినియోగించినట్లు తేలింది. దీనిపై విచారణ సాగుతోంది. పబ్బుల్లో పుట్టినరోజు వేడుకలు, వీకెండ్లలో డ్రగ్స్​ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక నుంచి వీకెండ్​ పార్టీలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నారు.

తాత్కాలికంగా ఈవెంట్స్​ వద్దంటూ పోలీసులు పలు దరఖాస్తులను తిరస్కరించారు. మరోవైపు అబ్కారీ శాఖ కూడా డ్రగ్స్​ వ్యవహారంపై దృష్టి పెట్టింది. వీకెండ్​లో ఎక్సైజ్​ అధికారులు తమ పరిధిలోని పబ్​లు, బార్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. స్పెషల్​ ఈవెంట్స్​ నిర్వహిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో వీకెండ్స్​లో గస్తీ నిర్వహించాలని ఎక్సైజ్​ శాఖ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే గస్తీ తిరగడం మొదలుపెట్టారు.

Tags:    

Similar News