IPL లో బెట్టింగ్ పెడుతున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే!

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ అభిమానుల్లో మరింత జోష్ పెంచేందుకు..latest telugu news

Update: 2022-03-30 06:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ అభిమానుల్లో మరింత జోష్ పెంచేందుకు ఐపీఎల్ సీజన్ 15 వచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల నడుమ మార్చి 26న మొదలైన ఐపీఎల్.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతేడాది కరోనా కారణం దుబాయ్‌లో మ్యాచ్‌లు నిర్వహించిన బీసీసీఐ.. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది స్వదేశంలోనే నిర్వహిస్తోంది. అయితే, ఐపీఎల్ అంటే ఎక్కువ గుర్తొచ్చేది బెట్టింగ్. తాను ఎంచుకున్న జట్టుపై బెట్టింగ్‌లు పెట్టి కొందరు లాభాలు పొందుతుంటే.. చాలా మంది నష్టపోయి ఇబ్బందులు పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.

ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌లపై హైదరాబాద్ సిటీ పోలీసులు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. ఒక్కరు చేసిన పనికి కుటుంబమంతా నష్టపోతుందని పోలీసులు అవగాహన కల్పిస్తూ పోస్ట్ చేశారు. ''క్రికెట్ బెట్టింగ్ ఒక విధ్వంసక వ్యాధి.. ఒక్కసారి బానిస అయితే కుటుంబం మొత్తం బాధపడుతుంది. దీనికి పాల్పడితే ఎప్పుడు విజేతగా నిలువలేరు. తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం-2017 ప్రకారం పబ్లిక్ గేమింగ్ అమలు చేయడం లేదా నిర్వహించడం నిషేధం. ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లైతే ఒక సంవత్సరం జైలు శిక్ష తప్పదని'' హెచ్చరిస్తూ పోస్ట్ చేశారు.

Tags:    

Similar News