అమెరికా అధ్యక్షుడితో ప్రధాని వర్చువల్ భేటీ

న్యూఢిల్లీ: రష్యాతో ఆయిల్ దిగుమతులపై అమెరికా అభ్యంతరం తెలుపుతున్న సమయంలో..latest telugu news

Update: 2022-04-10 16:52 GMT

న్యూఢిల్లీ: రష్యాతో ఆయిల్ దిగుమతులపై అమెరికా అభ్యంతరం తెలుపుతున్న సమయంలో అధ్యక్షుడు జోబైడెన్ తో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం భేటీ కానున్నారు. ఇరు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగానే వర్చువల్‌గా సమావేశం కానున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు నేతలు కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించనున్నారు. దాంతో పాటు దక్షిణాసియాలో ఇటీవలి పరిణామాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతం, పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేస్తారు' అని పేర్కొంది. వర్చువల్ సమావేశం ద్వైపాక్షిక సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యాన్ని కలిగి ఉందని తెలిపింది. క్వాడ్ నేతల సమావేశంలో ప్రధాని మోడీ, బైడెన్ తో చివరి సారిగా మాట్లాడారు. మరోవైపు 2+2 చర్చల కోసం విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ యూఎస్ చేరుకున్నారు.

Tags:    

Similar News