ఇదెక్కడి విడ్డూరం.. హోలి చందాలకు ఫోన్ పే స్కానర్..!

సమాజంలో రోజు రోజుకూ కొత్త కొత్త ఆవిష్కరణలు,టెక్నాలజీలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటిని అందిపుచ్చుకుంటూ సాగిపోవడమే జీవితం.

Update: 2022-03-10 16:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సమాజంలో రోజు రోజుకూ కొత్త కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటిని అందిపుచ్చుకుంటూ సాగిపోవడమే జీవితం. ఈ క్రమంలోనే ఫిజికల్ మనీ నుంచి డిజిటల్ పేమెంట్స్ వైపు ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఏ చిన్న షాపులో అయినా, తోపుడు బండ్ల వద్ద ఆన్లైన్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే, హోలీ సందర్భంగా పిల్లలు ఇంటింటికీ తిరుగుతూ "రింగు రింగు బిల్లా రూపాయి దండా" అంటూ.. చందాలు , బియ్యం వసూలు చేస్తుంటారు. అయితే ఇంటి ముందుకు వెళ్లిన చిన్నారులకు చిల్లర లేదని తిప్పి పంపిస్తుండటంతో పిల్లలు వినూత్నంగా ఆలోచించారు. ఎలాగైనా ఇంటింటికీ చందా వసూలు చేయాలనే లక్ష్యంతో ఫోన్ పే స్కానర్‌ పట్టుకొని ఊరంతా తిరిగారు. చిల్లర సమస్య లేకుండా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని కోరుతున్నారు. అయితే కొందరు గ్రామస్తులు దీనిని వీడియో తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Full View

Tags:    

Similar News