టీఎస్ ఐపాస్‌తో 19,138 పరిశ్రమలకు అనుమతులు

తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా 2015 జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 19,138 పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది.

Update: 2022-03-22 17:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా 2015 జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 19,138 పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. 229277.27కోట్లను ఆకర్షించింది. 16,39,346 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన పరిశ్రమల్లో అధిక శాతం ఇంజనీరింగ్ పరిశ్రమలే. పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా మక్కువ చూపడంతో 3595 పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 5658.66కోట్లను ఆకర్షించి 32,132 మందికి ఉపాధి కల్పించారు.

రెండో స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలు ఉన్నాయి. 3415 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి 6281.13కోట్లను ఆకర్షించడంపాటు 70812 మందికి ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. మూడో స్థానంలో వ్యవసాయరంగ ఉత్పత్తులకు సంబంధించిన స్టోరేజ్ లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2415 ఏర్పాటు చేయగా, 2392.94కోట్ల పెట్టబడులను ఆకర్షించి 30125 మందికి ఉపాధి కల్పించారు.

ఇదిలా ఉంటే సిమెంట్ అండ్ కాంక్రిట్ ప్రొడక్టు సంబంధించిన 1804 పరిశ్రమలను అనుమతులు ఇచ్చి 3138.07కోట్లు రాబట్టి 21331 మంది ఉపాధి కల్పించారు. గ్రానైట్ అండ్ స్టోన్ క్రషింగ్ పరిశ్రమలు 1447 అనుమతి ఇచ్చి 4455.52కోట్లను ఆకర్షించి 27240మందికి ఉపాధి కల్పించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 61374.41కోట్లతో 16 థర్మల్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 12760 మందికి ఉపాధి కల్పించారు. అదే విధంగా రియల్ఎస్టేట్, ఇండస్ట్రీయల్ పార్కు మరియు ఐటీ భవనాలను 57438.83కోట్లతో 174 ఏర్పాటు చేసి 901513 మందికి ఉపాధి, ఫార్మాసూటికల్ అండ్ కెమికల్స్ పరిశ్రమలను 22325.15కోట్లతో 1249 ఏర్పాటు చేసి 113004 మందికి ఉపాధి, సోలార్ అండ్ రీనెవెబుల్ ఎనర్జీ పరిశ్రమలు 225 నుంచి 20658.82కోట్లతో ఏర్పాటు చేసి 8145 మందికి ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వం గణాంకాలను వెల్లడించింది.

ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్ మరియు ఇన్నోర్జనిక్ తదితర అనుబంధ పరిశ్రమలను 155 ను 8755.47కోట్లతో ఏర్పాటు చేసి 4986 మందికి ఉపాధి కల్పించగా, ప్లాస్టిక్ అండ్ రబ్బర్ పరిశ్రమలను 6277.75కోట్లతో 1279 ఏర్పాటు చేసి 32132 మందికి ఉపాధి, ఆర్అండ్ డీ 320 పరిశ్రమలను5016.05కోట్లతో ఏర్పాటు చేసి 34232 మందికి ఉపాధి, అదర్స్ 515 పరిశ్రమలను 4204.85కోట్లతో 31346 మందికి, టెక్స్ టైల్స్ లో 624 పరిశ్రమలను 4147.16కోట్లతో ఏర్పాటు చేసి 204108 మందికి, బేవరేజస్ లో 529 పరిశ్రమలను 4136.96కోట్లతో 11505 మంది ఉపాధి, పేపర్ మరియు ప్రింటింగ్ 592 పరిశ్రమలను 3729.52కోట్లతో ఏర్పాటు చేసి 14045 మందికి, 8 డిఫెన్స్ పరిశ్రమలను 2838.33కోట్లతో ఏర్పాటు చేసి 5775 మందికి, 4 ఐటీ సర్వీసులను 2479.60కోట్లతో ఏర్పాటు చేసి 22150మందికి , 366 ఉడ్ అండ్ లెదర్ పరిశ్రమలను 159.59కోట్లతో ఏర్పాటు చేసి 4450మందికి ఉపాధి కల్పించినట్లు అధికారికంగా ప్రభుత్వం వెల్లడించింది.

31 ఆటో మొబైల్ పరిశ్రమలను 1362.51కోట్లతో ఏర్పాటు చేసి 3474 మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొంటున్నప్పటికీ వాస్తవంగా ఇప్పటి వరకు 14579 పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయి. 94,8438 మందికి మాత్రమే ఉపాధి కల్పించినట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News