Palasa: 'పలాస 1978' చిత్ర దర్శకుడికి అరుదైన గౌరవం
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో పెద్ద సినిమాలే కాకుండా ఒక్కోసారి చిన్న సినిమాలు సైతం కుదిపేస్తుంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో పెద్ద సినిమాలే కాకుండా ఒక్కోసారి చిన్న సినిమాలు సైతం కుదిపేస్తుంటాయి. ఇటీవల అర్జున్ రెడ్డి, పలాస, కలర్ ఫొటో, జాతి రత్నాలు వంటి సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పెద్ద సినిమాలకు పోటీ ఇచ్చాయి. అయితే, పలాస చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని దర్శకుడు కరుణ కుమార్ తనవైపు తిప్పుకున్నారు. సామాజిక స్పృహ కలిగిన సినిమా కావడంతో అందరికీ ఇట్టే కట్టిపడేసింది. ఈ సినిమా విడుదలై దాదాపు మూడేళ్ళు అయింది. కానీ, ఇప్పుడు కూడా ఆ సినిమా పేరు రోజూ ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం. అయితే, తాజాగా.. ఈ చిత్రం 'రోజ్ ఫిల్స్ ఫెస్టివల్'కు ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ ఈ విషయాన్ని సంతోషంగా తెలిపారు. 'ఎస్సీ, ఎస్టీల జీవనాన్ని, వారి జీవిత కథలను చిత్రాల్లో మలిచి చూపించిన డైరెక్టర్ పారంజిత్. ఆయన 2018లో వానమ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. కరోనా తార్వత ఇప్పుడు మళ్లీ జరుపుతున్నారు. ఇలాంటి ఫెస్టివల్‌లో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని 'పలాస' తో నాకు తెలిసొచ్చిందన్నారు. దాంతో పాటు ఇటువంటి వేదికల పై 'పలాస 1978 ' సినిమా ప్రదర్శించడం దర్శకుడిగా ఇది మరిచిపోలేని అనుభవం కాబోతుంది అని కరుణ కుమార్ తెలిపారు.