93 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఒకే మ్యాచ్‌లో అరుదైన రికార్డులు..
దిశ, వెబ్‌డెస్క్: పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ టెస్టు క్రికెట్‌లో అద్భత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ టెస్టు క్రికెట్‌లో అద్భత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అబ్దుల్లా షఫీక్ శ్రీలంకపై 160 పరుగులు చేసి పాక్ జట్టుకు కీలక పాత్ర పోషించాడు. కాగా తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాడు. ఎక్కువ బంతులు ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చిన రెండో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ 1929లో మెల్‌బోర్న్ వేదికగా హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 462 బంతుల్లో 135 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు. అదే విధంగా 400 బంతుల్లో 160 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన రెండో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. దీంతో 93 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు సాధించి తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాక టెస్టు మ్యాచ్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో 400 కంటే ఎక్కువ బంతులు ఆడిన ఐదవ బ్యాట్స్‌మాన్‌గా అబ్దుల్లా షఫీక్ నిలిచాడు. అతనికి ముందు నాల్గవ ఇన్నింగ్స్‌లో 400 కంటే ఎక్కువ బంతులు ఆడిన వారిలో హెర్బర్ట్ సట్‌క్లిఫ్, సునీల్ గవాస్కర్, మైక్ అథర్టన్, బాబర్ ఆజం ఉన్నారు.