జనవరిలో ఎనిమిది కీలక రంగాల వృద్ధి 3.7 శాతం!

Update: 2022-02-28 14:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి ఈ ఏడాది జనవరిలో 3.7 శాతానికి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే నెలలో కీలక రంగాల్లో ఉత్పత్తి ఇది 1.3 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. సహజ వాయువు, బొగ్గు, సిమెంట్ పరిశ్రమల్లో ఉత్పత్తి మెరుగ్గా ఉండటమే దీనికి కారణం. సమీక్షించిన నెలలో ముడి చమురు, ఎరువుల ఉత్పత్తి మినహా మిగిలిన అన్ని రంగాల్లో సానుకూల వృద్ధి నమోదైంది. అంతకుముందు 2021, డిసెంబర్‌లో కీలక రంగాల ఉత్పత్తి 4.1 శాతం క్షీణతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఎనిమిది కీలక రంగాల్లో ఉత్పత్తి గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 11.6 శాతం పెరిగాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 8.6 శాతం ప్రతికూలత నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. జనవరిలో బొగ్గు ఉత్పత్తి 8.2 శాతం, సహజ వాయువు 11.7 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 3.7 శాతం, సిమెంట్ ఉత్పత్తి 13.6 శాతం పెరిగాయి. ముడి చమురు 2.4 శాతం, ఎరువుల ఉత్పత్తి 2 శాతం క్షీణించాయి.

Tags:    

Similar News