దిశ కథనానికి స్పందన.. కదిలిన యంత్రాంగం

దిశ, నిజాంపేట్: దిశ కథనంతో ప్రభుత్వ అధికారులు స్పందించారు..Officers Responded Over Disha News Article

Update: 2022-03-10 12:21 GMT

దిశ, నిజాంపేట్: దిశ కథనంతో ప్రభుత్వ అధికారులు స్పందించారు. బాచుపల్లి సర్వే నెంబర్ 186 లో గల ప్రభుత్వ స్థలంలో రూమ్ నిర్మించి కబ్జా చేసిన విషయాన్ని దిశ పత్రిక "సర్కారు భూములు స్వాహా.. రెచ్చి పోతున్న కబ్జాదారులు" అనే కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కథనంపై బాచుపల్లి తహశీల్దార్ సరిత స్పందించి తన సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాచుపల్లిలో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకోమని, ఎంతటివారైనా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఎవ్వరు అమ్మినా కొన్నా శిక్షర్హులన్నారు.

Tags:    

Similar News