దిశ ఎఫెక్ట్.. నూడా డ్రాఫ్ట్ ప్లాన్ అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగింపు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్స్ అథారిటీ రూపొందిస్తున్న..NUDA Draft Plan Objections's Deadline Extended

Update: 2022-03-19 12:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్స్ అథారిటీ రూపొందిస్తున్న డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించినట్లు నూడా చైర్మెన్ సిహెచ్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1 నుంచి 15 వరకు ప్రజల నుంచి నూడా డ్రాప్ట్ ప్లాన్ పై అభ్యంతరాల స్వీకరించగా.. 620 మాత్రమే వచ్చాయి. ఈ విషయంపై దిశ దిన పత్రికలో శనివారం గడువు ముగిసిన ప్రజల చెంతకు చేరని ప్లాన్ అంటూ వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, హైదరాబాద్ వారి సూచనల మేరకు మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించడానికి గడువు తేదీని మార్చి 31 వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, నూడా (73 గ్రామాలు) పరిధిలో నుడా మాస్టర్ ప్లాన్ ( 568.32 చదరపు కిలో మీటర్ల) పై అభ్యంతరాలు కలిగినవారు నూడా ఆఫీసులో, ఆఫీస్ పని వేళలలో వారి అభ్యంతరాలను సమర్పించాలని కోరారు.

Tags:    

Similar News