నిర్మల్: శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న.. మాజీ ఎమ్మెల్యే
దిశ, నిర్మల్ కల్చరల్: శ్రీరామనవమి సందర్భంగా - Nirmal former MLA Maheshwar Reddy participated in the Sri Rama Navami celebrations
దిశ, నిర్మల్ కల్చరల్: శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్ నియోజక వర్గంలోని లక్ష్మణచందా, దిలవార్ పూర్ మండలాల్లోని రామాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. లక్ష్మణచాంద మండలంలోని చామన్ పల్లి, వడ్యాల్ గ్రామాల్లోని సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరైనారు. అదేవిధంగా దిలావర్ పూర్ మండలంలోని రాంపూర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వీరి వెంట రాజేశ్వర్, ముత్యం, గంగన్న, ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.