ఆర్కిటిక్ కరిగిపోయే వేడి.. పరిణామాలు దారుణమన్న కొత్త అధ్యయనం
మరోసారి భూమిపైన జళప్రళయం తప్పదని హెచ్చరిస్తున్నారు. New data reveals that extraordinary global heating in the Arctic.
దిశ, వెబ్‌డెస్క్ః మనుషులు సౌకర్యాలకు, సుఖానికి అలవాటుపడ్డారు. జనాభాకు మించిన మోటారు వాహనాలు, ఎటుచూసినా పరిశ్రమలు- పొగ గొట్టాలు, భూమి లోపల నుండి సాధ్యమైనంత ఖనిజాలను తొవ్వి బయటలకు తీస్తున్న వైనం, భూమి పైన ఎక్కడికక్కడ చెట్లను నరికేస్తున్న పరిస్థితి.. ఇలా, అడుగడుగునా భూమిని చిత్రవధ చేస్తుంటే, కాలుష్యం పెరగక ఏమౌతుంది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రధాన ప్రచారం అయ్యింది. గ్లోబల్ వార్మింగ్.. అతి పెద్ద వార్నింగ్! తాజాగా మరో కొత్త అధ్యయనంలో విస్తుపోయే పరిణామాలను వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఉపరితల గాలి ఉష్ణోగ్రత (SAT) డేటాను అధ్యయనం చేసే 'బారెంట్స్ ఏరియాపై అసాధారణమైన వేడి' అనే అంశంపై అధ్యయనం చేశారు. ఇందులో ఆర్కిటిక్‌లోని ఉత్తర బారెంట్స్ ప్రాంతం గరిష్టంగా వేడెక్కుతుందని విశ్లేషణలో వెల్లడించారు. సమగ్ర SAT డేటాసెట్ ఆధారంగా గత 20-40 సంవత్సరాల్లో వేడెక్కుతున్న పరిణామాలను అధ్యయనం చేశారు.
శాస్త్రవేత్తలు, గణాంకపరంగా 10 సంవత్సరాలకు గాను 2.7 °C వరకు అధిక వార్షిక వేడిని గుర్తించారు. వేసవిలో గరిష్టంగా దశాబ్దానికి 4.0 °C వరకు ఉంటుందని గమనించారు. ఈ ప్రాంతంలో ఇంతటి వేడి ఏర్పడటం ఆర్కిటిక్‌లోని మిగిలిన ప్రాంతాకు "ముందస్తు హెచ్చరిక" అని పరిశోధకులు తెలిపారు. అధ్యయనాన్ని ఉటంకించిన ది గార్డియన్.. ఉపరితల గాలి ఉష్ణోగ్రత (SAT), సముద్రపు మంచులో మార్పులు, ఆర్కిటిక్‌లో కొనసాగుతున్న పర్యావరణ పరివర్తనకు ప్రధాన కారకాలని పేర్కొంది. అలాగే, ఇవి గ్లోబల్ వార్మింగ్ ప్రధాన సంకేతంగా ఉద్భవించాయని తెలిపింది. నాలుగు దశాబ్దాలకు పైగా, ఆర్కిటిక్ సముద్రపు మంచు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నేళ్లలో డాటాను చూస్తే, సెప్టెంబర్‌లో అతిపెద్దగా, మార్చి 3న అతి తక్కువగా నమోదైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు. 1979, 2021 మధ్య చూస్తే, సెప్టెంబర్ ట్రెండ్‌లో దశాబ్దానికి − 13.4% ఉండగా, మార్చి ట్రెండ్ − దశాబ్దానికి 2.6% కనిపిస్తోంది. ఇలాగే, కొనసాగితే, ఒకప్పటిలా మరోసారి భూమిపైన జళప్రళయం తప్పదని హెచ్చరిస్తున్నారు.