కలెక్టర్‌కు వ్యతిరేకంగా ప్రముఖ నాయకుడి చర్యలు.. పంతం నెగ్గించుకున్న పెద్ద మనిషి
దిశ, మక్తల్: మక్తల్ మున్సిపల్ ఇంచార్జి కమిషనర్‌గా కోస్గి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామికి అదనపు..latest telugu news
దిశ, మక్తల్: మక్తల్ మున్సిపల్ ఇంచార్జి కమిషనర్‌గా కోస్గి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామికి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ కలెక్టర్ హరిచందన మంగళవారం ఆర్డర్ జారీ చేశారు. అయితే గతంలో మక్తల్ మున్సిపల్లో వివాదస్పదమైన పనులు చేసినందుకు గాను ఆ స్థానంలో ఉన్న రాజయ్యను కమిషనరేట్కు సరెండర్ చేశారు. అనంతరం మక్తల్ మండల పరిషత్‌లో ఎంపీఓగా పనిచేస్తున్న పావనిని అతని స్థానంలో మక్తల్ మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్‌గా నియమిస్తు జిల్లా కలెక్టర్ ఇటీవల ఆర్డర్ జారీ చేశారు.
కానీ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యత తీసుకున్నప్పటి నుండి వారం రోజుల్లో ఒక్క గంటైన ఆమె ఆ సీట్లు కూర్చోలేదని మున్సిపల్ సిబ్బంది చెప్పారు. ఇందుకు కారణం నియోజకవర్గానికి చెందిన ఓ ప్రముఖ నాయకుడు పావనికి ఇన్చార్జి కమిషనర్‌గా కలెక్టర్ ఆర్డర్ జారీ చేసినప్పుడే వివాదం జరిగిందని సమాచారం. ప్రముఖ నాయకునికి ఇష్టం లేకపోవడంతో ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని వారం రోజులైనా ఒక్క గంటైన కమిషనర్ సీట్లో కూర్చో లేదని మున్సిపల్ సిబ్బంది తెలిపారు. దీంతో తనకు మున్సిపల్ ఇంచార్జి బాధ్యతల నుంచి మినాహించి తన సోంత శాఖకు బదిచేయాలని కలెక్టర్‌ను మూడు రోజుల కిందట పావని విల్లింగ్ లెటర్ చేసింది. దీంతో ఆమె అనుకున్నట్లే మంగళవారం రాత్రి ఆర్డర్ జారీ అయ్యింది. కాగా, మక్తల్ ఇంచార్జీ కమిషనర్‌గా మల్లఖార్జున స్వామి వారంలోని గురు, శుక్ర, శనివారాల్లోపు అందుబాటులో ఉండాలని కలెక్టర్ జారీ చేసిన ఆర్డర్‌లో పేర్కొన్నట్లు సమాచారం.