నర్సు కూతురిపై అత్యాచారం, హత్య.. వైట్ కాలర్ నేరగాళ్లతో తల్లి ఫైట్
దిశ, సినిమా: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన అప్ కమింగ్ సిరీస్ ‘మాయి’ ..telugu latest news
దిశ, సినిమా: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన అప్ కమింగ్ సిరీస్ 'మాయి' ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. దర్శకులు అన్షాయ్ లాల్, అతుల్ మోంగియా ఈ సిరీస్‌ను పూర్తి క్రైమ్ డ్రామాగా తెరకెక్కించగా సాక్షి తన్వర్ ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో సాక్షి 'షీల్' అనే మధ్యతరగతి భార్య, తల్లి, వాలంటీర్ నర్సు పాత్రలో నటించగా తన కూతురు 'సుప్రియ' నిర్దాక్షిణ్యంగా హత్య చేయబడుతుంది. దీంతో సాక్షి కలలుకన్న ప్రపంచమే మారిపోగా కూతురికి జరిగిన అన్యాయంపై చేస్తున్న పోరాటంలో భాగంగా హింస, నేరం, అవినీతిపై ఫైట్ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే సుప్రియ పై అత్యాచారం కూడా జరిగిందని తెలియడంతో తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకోవటానికి బయలుదేరిన షీల్.. వైట్ కాలర్ నేరాగాళ్లు, నీచ రాజకీయాలతో నిండిన ఈ సమాజంతో పోరాడి గెలిచిందా? అనుకున్నది సాధించిందా? అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠరేపుతోంది. ఇక క్లీన్ స్లేట్ ఫిలింస్ కర్నేష్ శర్మ నిర్మించిన ఈ సిరీస్‌లో వివేక్ ముష్రాన్, వామికా గబ్బి, ప్రశాంత్ నారాయణ్ కీలక పాత్రలు పోషించగా 2022 ఏప్రిల్ 15నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే ప్రీమియర్ కానుంది.
A mom in a world of crime. Will she survive? Will she... thrive? 🤔
— Netflix India (@NetflixIndia) March 24, 2022
Either way, minds will be blown.
Catch Sakshi Tanwar's dramatic journey in #Mai on 15th April, only on Netflix.#MaiOnNetflix pic.twitter.com/srKXocJjXt