ప్రకృతి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. ముంబాయ్ సముద్రతీరం ఇలా.. (వీడియో)
ఇది మనుషులు విస్మరిస్తున్న కఠినమైన వాస్తవికతను చూపిస్తోంది. Mumbai beach awash with tonnes of plastic.
దిశ, వెబ్‌డెస్క్ః భూ గ్రహంపైన కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2016 నాటికే, దాదాపు 60-90 శాతం సముద్ర ప్రాంతం, దాదాపు 14 నుండి 19 మిలియన్ టన్నుల ప్లాస్టిక్‌తో కప్పబడి ఉంది. నిస్సందేహంగా ఈ నిందను మోయాల్సింది మనుషులే. ఎన్నో రకాలుగా అవగాహనా కార్యక్రమాలు, ప్రచారాలు, సలహాలు, నియమాలు, నిబంధనలు ఉన్నా సరే, ప్రజలు ఇప్పటికీ చెత్తను సముద్రంలో పారేయడం మానుకోలేకపోతున్నారు. ఇక, మెజారిటీ ప్రజలు దాని వల్ల కలిగే హానిని కూడా గుర్తించరు. ఈ క్రమంలో, ఇటీవల, ఇండియాలోని ముంబై బీచ్‌లో పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించే వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఇది మనుషులు విస్మరిస్తున్న కఠినమైన వాస్తవికతను చూపిస్తోంది.
ముంబైమాటర్జ్ ట్విట్టర్ పేజీలో జూలై 16న పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఎప్పుడూ పక్షుల వీక్షణకు అనవాలుగా ఉన్న ముంబైలోని మాహిమ్ బీచ్ ఎంత దారుణంగా పాస్టిక్, చెత్తాచదారంతో కప్పేసుకుపోయిందో చూడొచ్చు. మనుషుల అనాలోచిన చర్యల వల్ల "అరేబియా సముద్రం ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్" చూడటానికి పెద్ద ఎత్తున ముంబై వాసులు మాహిమ్ బీచ్‌కి వచ్చారు" అని క్యాప్షన్ పేర్కొన్నాయి. నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో స్పష్టంగా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు కఠిన నిబంధనలు తీసుకురావాలని పలువురు చర్చించారు. మరికొందరు నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులకు భారీగా జరిమానా విధించాలని అభ్యర్థించారు.
#Beaches in #Mumbai now Open.
— मुंबई Matters™✳️ (@mumbaimatterz) July 16, 2022
Citizens throng Mahim beach to have a look at the #ReturnGift from ArabianSea..#PlasticPollution#MumbaiRains pic.twitter.com/1JUmIpWof2