Nani: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై నేచురల్‌స్టార్ నాని ఆసక్తికర కామెంట్స్

తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పై నేచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2024-11-23 04:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Powerstar Pawan Kalyan) పై నేచురల్ స్టార్ నాని(నతురల్ Nani) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రానా దగ్గుబాటి షో(Rana Daggubati Show)లో పాల్గొన్ననాని.. ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM)పై పొగడ్తల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీలో పవన్ గొప్ప గుర్తింపు దక్కించుకున్నారని అన్నాడు. సినిమాల్లో ఎలా స్టార్‌గా ఎదిగారో.. పాలిటిక్స్‌లో కూడా అదే స్థాయిలో ఎదిగారని తెలిపాడు. రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారని అభినందించారు. ఎంతోమందికి పవన్ కల్యాణ్ స్ఫూర్తినిచ్చి వక్తి అని వెల్లడించాడు.

ఇక నాని కామెంట్స్ పై రానా స్పందించి.. యస్ ఆయన నిజంగానే సూపర్‌స్టార్ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని అన్నాడు. రాజకీయాలు కూడా సినిమాల్లాగే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పవర్ స్టార్ విజయాలు, అపజయాలు గుర్తు చేసుకుంటూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక రానా దగ్గుబాటి షో కు నేచురల్ స్టార్ నానితో పాటుగా ప్రియాంక అరుల్(Priyanka Arul) కూడా పాల్గొని సందడి చేశారు. రానా అడిగిన క్వశ్చన్స్‌కు వీరిద్దరు ఇంట్రెస్టింగ్‌గా ఆన్సర్స్ చెబుతూ జనాల్ని అలరించారు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ను గోవా(Goa)లో జరుగుతోన్న 55 వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(International Film Festival of India)లో స్పెషల్‌గా ప్రదర్శించడం విశేషం. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో ఈ టాక్ షో ప్రసారం అవ్వనుంది.




Tags:    

Similar News