Governor Tamilisai: అన్ని విశ్వవిద్యాలయాల్లో జాతీయ విద్యా విధానాన్ని వెంటనే అమలు చేయాలి

Governor Tamilisai Says National Education Policy Should Implement in All Universities| జాతీయ విద్యా విధానాన్ని అన్ని విశ్వవిద్యాలయాలలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై అన్నారు

Update: 2022-07-20 09:05 GMT

దిశ, అంబర్ పేట్: Governor Tamilisai Says National Education Policy Should Implement in All Universities| జాతీయ విద్యా విధానాన్ని అన్ని విశ్వవిద్యాలయాలలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై అన్నారు . పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవ వేడుకలు బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గవర్నర్ తమిళ్ సై మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులు స్వయం ఉపాధి పెంపొందించడం తో పాటు ప్రపంచ పోటీల్లో తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల కార్యక్రమానికి రావడం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం తన 37 సంవత్సరాల ఉనికిలో భాష , సాహిత్యం , లలిత కళలు , ప్రదర్శక కళల వంటి రంగాల్లో ఉన్నత విద్యను అందించడం లో పేరుగాంచిందని తెలిపారు.

 తెలుగు విశ్వవిద్యాలయం మూడు కోణాల విధానాలు అవలంబిస్తోందని, బోధన , పరిశోధన, ప్రచురణలతో పాటు ప్రత్యేక కోర్సులు, అనేక రకాల విభాగాలతో కూడిన ఏకైక విశ్వవిద్యాలయమని కొనియాడారు. విశ్వ విద్యాలయంలో వివిధ అంశాల్లో పరిశోధనలు చేసి పీహెచ్ డీ పూర్తి చేసిన విద్యార్థులకు డాక్టరేట్, బంగారు పతకాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ మరో షాక్.. వాటి ఛార్జీలు భారీగా పెంపు

Tags:    

Similar News