RohithNara: భైరవం నుంచి నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) ప్రస్తుతం సాగర్ కె. చంద్ర (Sagar K. Chandra) దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) మూవీ చేస్తున్నాడు.

Update: 2024-11-06 11:23 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) ప్రస్తుతం సాగర్ కె. చంద్ర (Sagar K. Chandra) దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) మూవీ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ (shooting) జరుగుతుందని తెలుస్తుండగా.. తదుపరి ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడు సాయి శ్రీనివాస్. ‘BSS11’ వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్‌మెంట్ (announcement) ఇచ్చిన ఈ చిత్రానికి తాజాగా ‘భైరవం’ (Bhairavam) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ మూవీ నుంచి సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చెయ్యగా.. తాజాగా నారా రోహిత్ (Nara Rohith) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ‘RohithNara ను #భైరవం అనే భారీ ప్రపంచం నుండి వరదగా పరిచయం చేస్తున్నాము. తీవ్రమైన పాత్రలు అండ్ థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా కోసం సిద్ధంగా ఉండండి. త్వరలో మీ ముందుకు రాబోతోంది.. మరో పేలుడు కోసం రెడీగా ఉండండి’ అంటూ నారా రోహిత్‌ను పరిచయం చేశారు. ఇక ఈ పోస్టర్‌లో నారా రోహిత్ చాలా సీరియస్ (serious)గా కనిపిస్తుండటంతో పాటు.. కత్తితో ఓ వ్యక్తిని పొడిచాడు. అంతే కాకుండా.. బ్యాక్‌గ్రౌండ్ (Background)లో టెంపుల్ (temple) తో పాటు మంటలు కూడా చూడొచ్చు. ప్రజెంట్ ఈ పోస్టర్ ఎంతో విశేషంగా ఆకట్టుకుంటోంది.

కాగా.. ఈ చిత్రాన్ని ‘నాంది’ ఫేమ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) తెరకెక్కిస్తుండగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కే.కే రాధమోహన్ (KK Radhamohan) నిర్మిస్తున్నారు. ఇందులో నారా రోహిత్ (Nara Rohit), మంచు మనోజ్ (Manchu Manoj) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తమిళంలో ఘన విజయం సాధించిన ‘గరుడన్’ మూవీకి ‘BSS11’ రీమేక్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..