ఆఫీస్ వర్కర్స్ కోసం 'స్లీపింగ్ బాక్సెస్'.. నిలబడే నిద్రపోవచ్చు!

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. కానీ మెజారిటీ దేశాల ప్రజలు మాత్రం ఇప్పటికీ వారానికి 6 రోజులు పనిచేస్తున్నారు.. Latest Telugu News

Update: 2022-07-19 07:23 GMT

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. కానీ మెజారిటీ దేశాల ప్రజలు మాత్రం ఇప్పటికీ వారానికి 6 రోజులు పనిచేస్తున్నారు. ఇలా రోజుకు 10-12 గంటలు ఆఫీసు పనిచేస్తున్న ఉద్యోగులపై కలిగే ఒత్తిడి భౌతికంగా నష్టం కలిగిస్తోంది. మొదటి నాలుగైదు గంటలు ఉత్సాహంగా పనిచేస్తున్నప్పటికీ సెకండాఫ్‌లో మాత్రం అలసిపోయి వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. దీంతో కొద్దిసేపు వర్క్ డెస్క్‌లపై కునుకుతీసి రీచార్జ్ అవుతున్నారు. కానీ కంపెనీ దృష్టిలో ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఈ నేపథ్యంలోనే ఒక జపాన్‌ కంపెనీ నాప్ బాక్స్‌‌లు(స్లీప్ బాక్స్‌లు) డెవలప్ చేసింది. ఉద్యోగులు ఇందులో నిలబడే నిద్రపోవచ్చు.

ఈ నాప్ బాక్స్‌లను 'కమిన్ బాక్స్' అని కూడా పిలుస్తారు. టోక్యోకు చెందిన ఆఫీస్ ఫర్నిచర్ సప్లయర్ ఇటోకి, కొయోజు ప్లైవుడ్ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ బాక్స్‌ను ఆవిష్కరించాయి. వర్కింగ్ షిఫ్ట్స్ మధ్యన త్వరితగతిన చిన్నపాటి కునుకు తీయాలనుకునే ఉద్యోగులకు ఈ స్లీపింగ్ బాక్స్ ఆరోగ్యకరమైన పరిష్కారాన్ని అందిస్తుందని ఇటోకి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సైకో కవాషిమా తెలిపాడు. జపాన్‌లో కార్యాలయ వేళల్లోనే కాసేపు బాత్‌రూమ్‌లో నిద్రపోయే వ్యక్తులు చాలా మంది ఉన్నారన్న కవాషిమా.. అలాంటి ప్రదేశం కన్నా సౌకర్యవంతమైన ప్రదేశంలో పడుకోవడం మంచిదని వెల్లడించాడు.

నిజానికి జపనీయులు ఎటువంటి విరామం లేకుండా నిరంతరం పనిచేస్తారు. కాబట్టి ఆయా కంపెనీలు ఉద్యోగులకు విశ్రాంతి కల్పించేందుకు మరింత సౌకర్యవంతమైన విధానంగా దీనిని ఉపయోగించవచ్చు. ఇక జపాన్‌లో భీకరమైన పని సంస్కృతి ఉంది. CNBC ప్రకారం ప్రపంచంలోనే ఇక్కడ ఎక్కువ పని గంటలు అమలవుతున్నాయి.


Similar News