రూ.కోటికి పైగా నిధులు డ్రా.. సర్పంచ్, ఉప సర్పంచ్ భర్తల పేర్లతో చెక్కులు..

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో..latest telugu news

Update: 2022-03-23 12:25 GMT

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలు రూ.కోటికి పైనే జరిగాయనే వ్యాఖ్యలు బలంగా వినబడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ భూక్యా శ్రావణి, ఉప సర్పంచ్ యడమకంటి ఝాన్సీ లక్ష్మీలతోపాటు వారి భర్తల పేరు మీద కూడా పంచాయతీ నిధులు 116 చెక్కుల రూపంలో రూ.1,27,08,324 డ్రా చేసినట్లు మండల అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు. కాగా అధికారులు మాత్రం నూతన పంచాయతీ చట్టం నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన విషయంపై సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు పంపడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News