మణిపూర్ సీఎంగా బిరేన్ సింగ్

ఇంఫాల్: మణిపూర్‌లో సీఎం అభ్యర్థిపై బీజేపీ స్పష్టత - N Biren Singh To Be Manipur Chief Minister Again, BJP Ends Suspense

Update: 2022-03-20 11:39 GMT

ఇంఫాల్: మణిపూర్‌లో సీఎం అభ్యర్థిపై బీజేపీ స్పష్టత ఇచ్చింది. మరోసారి బిరేన్ సింగ్‌కే పట్టం కట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం మణిపూర్ సీఎంగా బిరేన్ సింగ్‌ను ఖాయం చేసింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు మణిపూర్‌లో ఈ ప్రకటన చేశారు. దీంతో బిస్వజిత్ సింగ్, యుమ్నం ఖేమ్‌చంద్‌లకు నిరాశే ఎదురైంది.


సీఎం విషయమై శనివారం ముగ్గురు నేతలు బీజేపీ అధిష్టానాన్ని కలిసిన సంగతి తెలిసిందే. మాజీ ఫుట్‌బాలర్, జర్నలిస్టు అయిన ఈ 61 ఏళ్ల బిరేన్ సింగ్ మణిపూర్‌లో బీజేపీ మరోసారి గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించారు. కాగా, తాజాగా జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 32 సీట్లలో గెలుపొంది, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News