‘ఇంకా కొనసాగుతున్న నా లవ్ స్టోరీ’.. రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-24 09:18 GMT

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది.

అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక తాజాగా ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్న అంటూ పోస్ట్ పెట్టింది. అప్పటి నుంచి దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఈ భామ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో సముద్ర తీరాన సూర్యాస్తమయంలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ట్యాగ్ చేస్తూ.. ‘సూర్యాస్తమయాలతో కొనసాగుతున్న నా ప్రేమకథ’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News