Dharmana Prasada Rao: సీఎం లక్ష్యాలు నెరవేర్చడమే నా లక్ష్యం: మంత్రి ధర్మాన

దిశ, ఏపీ బ్యూరో: రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖ‌ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు.

Update: 2022-04-13 07:22 GMT

దిశ, ఏపీ బ్యూరో: రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖ‌ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. మంత్రిగా త‌న‌కు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌కు ధర్మాన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన శాఖను చిత్తశుద్ధితో పనిచేసి ముఖ్యమంత్రి జగన్ అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు.

తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవని చెప్పుకొచ్చిన ధర్మాన ప్రసాదరావు.. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఉన్నతాధికారుల సమన్వయంతో పని చేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు పాలనలో మంచి పేరు తీసుకువస్తానని చెప్పుకొచ్చారు. రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ. రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి. దీనివల్ల ఎకనమికల్ గ్రోత్‌కు భూమి ఉపయోగపడటం లేదు.ఎక్కువ ల్యాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది. సీఎం వైఎస్‌ జగన్‌ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారు.

పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామినల్ ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారు అని మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు స్పష్టం చేశారు. టీం వర్క్ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఇకపోతే ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ ప్రభుత్వం లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ అనుభవంతో రెవెన్యూశాఖలో మెరుగైన పనితీరు కనబరుస్తారని సీఎం జగన్ భావించి ఆ శాఖ కట్ట పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే జగన్ శాఖలో ఇదే శాఖను ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ పర్యవేక్షించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News