వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపండి.. పాక్ ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోయే కొన్ని..latest telugu news
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోయే కొన్ని గంటల ముందు ప్రజలకు కీలక ఆదేశాలు జారీచేశారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ దేశ ప్రజలంతా కార్యాలయాలు, ఇళ్లు వీడి వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పాక్ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. 'నేను వారిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక వేసుకున్నాను. ఆదివారం మీరు అది చూస్తారు.
నా ప్రజలు అప్రమత్తంగా, సజీవంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే వేరే దేశంలో జరిగితే ప్రజలు ఇప్పటికే బయటకు వచ్చారు. మీరంతా సోమవారం వీధుల్లోకి రావాలని కోరుతున్నాను. దేశ ప్రయోజనాల కోసం మీరు ఇలా చేయాలి. సోమవారం అసెంబ్లీలో వారిని ఓడించి చూపిస్తాను' అని అన్నారు. మొత్తం 342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ పదవిలో కొనసాగాలంటే 172 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. తాజాగా మిత్రపక్షాలు కూడా ఆయనకు షాక్ ఇచ్చి మద్దతు ఉపసంహరించుకున్నాయి. దీంతో ఇమ్రాన్‌కు మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య మెజారిటీ కిందికి పడిపోయింది. అయితే ఇమ్రాన్ భవితవ్యం తేలాలంటే సోమవారం అసెంబ్లీ ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే.