నెంబర్ ప్లేట్‌పై 'ఎమ్మెల్యే మనవడు'.. వైరల్ అవుతున్న ఫొటో
దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలాన ఏం జరుగుతున్న..telugu latest news
దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలాన ఏం జరుగుతున్న అది వైరల్ అవుతుంది. అలాంటి సంఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సాధారణంగా వాహనాలకు నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా ఉంటుంది. కాని ఒక వెహికల్‌కు మాత్రం నెంబర్ ప్లేట్‌పై అక్షరాలకు బదులుగా 'ఎమ్మెల్యే మనవడు' అని రాసి ఉన్న బైక్ తమిళనాడులో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. బిజెపి ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ, ఈయన తమిళనాడులోని కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన రాష్ట్ర అసెంబ్లీకి ధోతీని ధరించే వెళ్తారు. చాలా నిరాడంబరమైన వ్యక్తి, ఎక్కువగా సాధారణ జీవితం గడుపుతుంటారు. ఆయన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నాడు. ఎంఆర్ గాంధీ కారు డ్రైవర్ కన్నన్. ఈయన ఎంతో కాలంగా గాంధీ వద్ద పనిచేస్తున్నాడు. అతనితో ఎంతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాడు. ప్రస్తుతం నెంబర్ ప్లేట్ గురించి వైరల్ అవుతున్న ఫొటోలోని వ్యక్తి గాంధీ కారు డ్రైవర్ కన్నన్ కొడుకు 'అమ్రిష్'. అతను తన బైక్‌పై 'ఎమ్మెల్యే మనవడు' అని రాసుకొని తిరుగుతున్నాడు. దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతుంది. దీనిపై కొందరు నెటిజన్లు ఇది చట్ట విరుద్ధమైన చర్య అంటూ మిమ్స్ ద్వారా ట్రోలింగ్ చేస్తున్నారు.
Grandson of TN MLA do not need number plate and can violate traffic rules pic.twitter.com/aEnRrHTeTh
— SAI@SAA (@sainairv) March 14, 2022