Infant Care: చిన్నపిల్లలు తరచూ నాలుకను బయటపెట్టడానికి కారణం..!
చిన్న పిల్లల చిలిపి పనులు చూడానికి ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. కానీ
దిశ, వెబ్‌డెస్క్: చిన్న పిల్లల చిలిపి పనులు చూడానికి ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. కానీ కొన్ని వింత అలవాట్లు మాత్రం పేరెంట్స్‌ను భయపెడతాయి. అయితే కామన్‌గా చిన్నపిల్లలు పదే పదే నాలుకను బయటపెడుతుండటం చూస్తూనే ఉంటాం. దాదాపు ఈ అలవాటు పిల్లల్లో ఆరు నెలల వరకు ఉంటుంది. మరీ పిల్లలు ఇలా ఎందుకు పెడతారు? దాని అర్థం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దీన్ని థ్రస్ట్ రిఫ్లెక్స్(Thrust reflex) అని అంటారు. పసిపిల్లలు నాలుకను,పెదాలను తాకినప్పుడు నాలుకను ముందుకు నెడతారు. ఇది పిల్లల సహజ రిఫ్లెక్స్ గానే పనిచేస్తుంది. ఈ విధంగా శిశువు ఆహారం త్రాగడం మొదలుపెడుతుంది. శిశువు గుండె, ముక్కు కంటే ముందు భాగంలో ఉన్న పెదాలను తాకినప్పుడు ఉత్పన్నమవుతుంది. తద్వారా శిశువు నాలుకను ముందుకు పుష్ చేస్తూ పాల బాటిల్స్ నుంచి పాలను తాగడానికి ప్రేరేపిస్తుంది. శిశువుకు తల్లి పాలు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ నాలుగు నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది.
అలాగే పసిపిల్లలు తరచూ నాలుక బయటపెడితే.. వారికి ఆకలి వేస్తుందని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఓ రకంగా నాలుక బయటకు తీయడం వల్ల పిల్లలకు మేలేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ చర్య వల్ల శిశువు నోటి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పిల్లలు అలసిపోయినప్పుడు లేదా వారికి బోరు కొట్టినప్పుడు కూడా తమ నాలుకను బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది వారి పట్ల ప్రదర్శించే సహజ ప్రవర్తనగా ఉంటుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.