కోయిల్ సాగర్ జల విహార యాత్రలో.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ, దేవరకద్ర: కోయిల్ సాగర్.. ఇది నిన్నమొన్నటిదాకా - Minister Srinivas Goud launches boats at Koil Sagar

Update: 2022-03-17 14:59 GMT

దిశ, దేవరకద్ర: కోయిల్ సాగర్.. ఇది నిన్నమొన్నటిదాకా ఒక జలాశయం.. రైతుల పంటల సాగుకు నీటిని ఇచ్చే వరప్రదాయిని. చేపల ఉత్పత్తి కేంద్రం.. ఓ చిన్న పాటీ విహార కేంద్రం.. కానీ ఇప్పుడు ఈ కోయిల్ సాగరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇక్కడికి వచ్చే పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు.. జల విహారం చేసి.. ఆనంద సాగరంలో మునిగి తేలేందుకు వీలుగా బోట్లను ఏర్పాటు చేశారు. రద్దీని బట్టి జలవిహారం చేసేందుకు వీలుగా ఒక పెద్ద బోటు, మరో చిన్న బోటును రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.


బోట్లను ప్రారంభించి మంత్రి, ఎమ్మెల్యేతో పాటు స్థానిక నేతలు బోట్‌లో విహరించి అందరికీ ఆనందాన్ని కలిగించారు. నిర్ణయించిన రేట్ల ప్రకారం శుక్రవారం నుంచి అక్కడికి వచ్చే సందర్శకులు బోటు వివరాలు చేసే విధంగా నిర్వాహకులు చర్యలు చేపట్టారు. వేసవిలోనూ కోయిల్ సాగర్ లో జలమట్టం తగ్గకుండా ఉండడం తో సందర్శకులు హాయిగా వివరించడానికి అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News