గర్ల్ ఫ్రెండ్ చేతిలో చెంప దెబ్బలు తిన్న సింగర్.. మరో అమ్మాయితో ఎఫైర్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సింగర్ మైకా సింగ్ పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపాడు. అలాగే తనకు కావాల్సిన అమ్మాయి లక్షణాలు కూడా చెప్పేసిన గాయకుడు.. గతంలో ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లు చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు..Latest Telugu News
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సింగర్ మైకా సింగ్ పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపాడు. అలాగే తనకు కావాల్సిన అమ్మాయి లక్షణాలు కూడా చెప్పేసిన గాయకుడు.. గతంలో ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లు చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఆమె అందంగా ఉండేది. తనతో ఫన్నీగా ఉండేవాడిని. అంతేకాదు పుట్టబోయే పిల్లలకు సన్నీ, బన్నీ అని పేర్లు కూడా ఫిక్స్ చేశా. కానీ, ఈ విషయాలేవి నా ప్రేయసికి తెలియకుండా జాగ్రత్తపడేవాడిని.
ఫోన్లో కూడా మిగతా గర్ల్ ఫ్రెండ్స్ పేర్లను రాజేశ్, రాకేశ్ అంటూ రకరకాలుగా సేవ్ చేసుకునేవాడిని. ఒకరోజు ప్రియురాలు ఇంటికి వచ్చినప్పుడు అబ్బాయిల పేరుతో ఉన్న నెంబరు నుంచి కాల్ వచ్చింది. దీంతో టెన్షన్ పడుతున్న నన్ను చూసి ఫోన్ లిఫ్ట్ చేయమని అడిగింది. ఇక అంతే అమ్మాయి గొంతు విని చెంప చెళ్లుమనిపించింది' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ దెబ్బతో తనమీద ఎంత ప్రేముందో అర్థమైందన్న మైకా సింగ్ అప్పటినుంచి నిజాయితీగా ఉంటున్నట్లు వెల్లడించాడు.