Sai Dharam Tej: రాజకీయాల్లోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘రేయ్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘రేయ్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కానీ 2016లో ‘సుప్రీమ్’ (supreme)మూవీ తర్వాత యాక్సిడెంట్ కావడంతో కొన్నేళ్లు సినిమాలకు దూరం అయ్యారు. మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ‘బ్రో’ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. 2023లో ‘విరూపాక్ష’(Virupaksha) చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించారు. ప్రజెంట్ ‘SDT-18’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 18న విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) రాజకీయాల్లోకి(politics) రావడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నా ఫోకస్ మొత్తం సినిమాపైనే ఉంది. మరెన్నో విభిన్నమైన చిత్రాల్లో యాక్ట్ చేయాలని ప్రేక్షకులను అలరించాలను కోరుకుంటున్నా. కానీ రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ లేదు. అసలు పాలిటిక్స్(politics)లోకి రావాలంటే ఎన్నో విషయాలను నేర్చుకోవాలి. ముఖ్యంగా ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. లేదంటే రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేయలేం’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.