Meenakshi Chaudhary: అక్కినేని హీరోను పెళ్లి చేసుకోబోతున్న మీనాక్షి చౌదరి? హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Update: 2024-11-08 11:50 GMT
Meenakshi Chaudhary: అక్కినేని హీరోను పెళ్లి చేసుకోబోతున్న మీనాక్షి చౌదరి? హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత కిలాడి, హిట్, గుంటూరు కారం(Guntur Kaaram) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ ఏడాది మీనాక్షి చౌదరి నటించిన గోట్, లక్కీ భాస్కర్(Lucky Bhaskar) బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ప్రజెంట్ ఈ అమ్మడు వరుణ్ తేజ్(Varun Tej) ‘మట్కా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

అయితే ఇందులో వరుణ్ తేజ్ హీరోగా నటించగా.. ‘మట్కా’(Matka) నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అక్కినేని హీరో(Akkineni Hero)ను పెళ్లి చేసుకోబోతుందంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగార్జున(Nagarjuna) మేనల్లుడు సుశాంత్(Sushanth) ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

కాళిదాసు, కరెంట్, లవ్లీ, అడ్డా వంటి సినిమాలతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ సుశాంత్ అంతగా రాణించలేకపోయారు. అయితే మీనాక్షి చౌదరి, సుశాంత్(Sushanth) గత కొన్నేళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కినేని హీరోను త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News