రైల్వే సహాయకుల కుటుంబ సభ్యులకు వైద్యం, విద్య ఫ్రీ: కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణోయ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు..telugu latest news

Update: 2022-04-01 10:28 GMT

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణోయ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. లైసెన్స్‌డ్ రైల్వే పోర్టర్స్ లేదా కూలీల(సహాయకులు) కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం తో పాటు, పిల్లలకు ఉచిత విద్య అందించనున్నట్లు శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. రైల్వే ఉద్యోగులు కాకపోయినా కొన్ని సదుపాయాలు అదనంగా కల్పించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన రాత పూర్వక సమాధానం ఇచ్చారు. 'సహాయకులు, వారి కుటుంబ సభ్యులకు రైల్వే ఆసుపత్రులు, రైల్వే హెల్త్ యూనిట్లలో మెడికల్ రూల్స్‌లో ఉన్నట్లుగా రైల్వే ఉద్యోగులతో సమానంగా వైద్య సౌకర్యాలు అందించబడుతున్నాయి. ఇక్కడ సహాయకులు ప్రస్తుతం ఇతర రైల్వే హెల్త్ యూనిట్లు రైల్వే ఆసుపత్రులకు రెఫరల్‌తో సహా అందుతున్నాయి. కానీ, రైల్వే తో అనుసంధానం చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రులకు కాదు' అని తెలిపారు. టిక్కెట్లలోనూ వీరికి అదనపు సేవలు ఉన్నాయని చెప్పారు.

Tags:    

Similar News