నగరంలో పెట్రోల్ దందా.. లీటరు అడిగితే.. పోసేది అర లీటరే..

దిశ, ముషీరాబాద్ : నగరంలోని హైదర్‌గూడ పెట్రోల్ బంక్‌లో లీటరు పెట్రోల్ పోయించుకుంటే అర.. latest telugu news

Update: 2022-04-08 17:06 GMT

దిశ, ముషీరాబాద్ : నగరంలోని హైదర్‌గూడ పెట్రోల్ బంక్‌లో లీటరు పెట్రోల్ పోయించుకుంటే అర లీటరే పోస్తున్నారని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ మహిళా ప్రధాన కార్యదర్శి కవి లత, సయుద్ అంజా, ఆఫ్రోజ్ ఖాన్ తదితరులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ మహిళా ప్రధాన కార్యదర్శి కవి లత తన టూ వీలర్‌లో శుక్రవారం హైదర్‌గూడ బర్మ పెట్రోల్ బంక్‌లో రూ. 100 రూపాయల పెట్రోలు పోయామని చెప్పింది. కానీ సదరు సిబ్బంది మాత్రం మీకు 200 వందల రూపాయల పెట్రోల్ పోసామని, దీంతో పోసిన పెట్రోల్‌ను బండి నుండీ తీశారు. అదేంటి అంటే మీకు 200 వందల రూపాయల పెట్రోల్ పోసాము.. అందుకే తీశాం అని సిబ్బంది అన్నాడు. దీంతో సదరు మహిళ నాకు పెట్రోల్ తక్కువ పోసారని, ఎక్కువ పోసినట్లుగా అబద్దం చెబుతున్నారని, తనకు న్యాయం కావాలని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు తదితరులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.

అదే సమయంలో సయుద్ అంజా అనే యువకుడు వచ్చి 200 రూపాయల పెట్రోల్ పోయామని చెప్పగా, కేవలం 5 సెకన్లలోనే తీసేశారని, డౌట్ వచ్చి చూడగా 1.3 లీటర్ల పెట్రోల్ ఉందని, అప్పటికే మా బండిలో 400 ఎం‌ఎల్ పెట్రోల్ ఉందని సయుద్ తెలిపాడు. 400 ఎంఎల్ పెట్రోల్ ఉండగా 200 రూపాయల పెట్రోల్ పోయిస్తే పెరగాలి కదా.. కానీ పెరగలేదని వాపోయాడు. ఈ బాధితులందరూ పెట్రోల్ బంక్ మేనేజర్ అజీమ్‌ను నిలదీశారు. దానికి ఆయన మిషన్ సమస్య అని కాసేపు.. కాదు.. కాదు.. మా సిబ్బంది మిస్టేక్ చేశాడు అని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. చేసేదేమీ లేక బాధితులు తూనికల కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తూనికలు కొలతలు శాఖ అడ్మినిస్ట్రేటివ్ అధికారి శివానందం, ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ ల నేతృత్వంలో పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. స్పీడ్ గా పెట్రోల్ పోసే గన్స్ వద్ద తక్కువ పెట్రోల్ వస్తుందని, స్పీడ్ పెట్రోల్ గన్స్ ను నిలిపివేయించారు. దాంతో పాటు వినియోగదారులకు తక్కువ పెట్రోల్ వస్తుందని అనుమానం ఉన్న ఒక పెట్రోల్ బంకులో ఓ మిషన్‌కు సీజ్ వేయగా మిగతావి యధా విధంగా కొనసాగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News