పంట చేనులో దిష్టి బొమ్మ ఉద్యోగం.. నెలకు రూ. 15 వేల జీతం

దిశ, ఫీచర్స్ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే వరకు..latest telugu news

Update: 2022-03-31 07:22 GMT

దిశ, ఫీచర్స్ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే వరకు నమ్మకం ఉండటం లేదు. అడవి జంతువులు, పక్షుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం కాపలా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అయినప్పటికీ ఏదో సమయంలో దాచేస్తూ పంటను లూటీ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ రైతు వినూత్న ఐడియాతో తన మొక్కజొన్న పంటకు రక్షణ కల్పిస్తున్నాడు. ఇందుకోసం ఒక వ్యక్తిని నియమించుకుని అతన్ని ఎలుగుబంటిగా మార్చేశాడు.

సాధారణంగా పంటపై పక్షులు వాలకుండా ఉండేందుకు రైతులు ఎండు గడ్డితో తయారుచేసిన దిష్టి బొమ్మలను పొలంలో అక్కడక్కడ ఏర్పాటు చేస్తుంటారు. లేదా భారీ శబ్దాలతో కోతులు, పక్షులు, అడవి పందులు దరిదాపుల్లోకి రాకుండా భయపెడుతుంటారు. కానీ సిద్దిపేట, కోహెడ ప్రాంతంలో భాస్కర్ రెడ్డి అనే రైతు.. ఏకంగా ఒక వ్యక్తిని నియమించి, అతనితో ఎలుగుబంటి దుస్తులు ధరింపచేశాడు. ఈ మేరకు అతను రోజంతా అదే వేషంలో చేనులో కలియతిరుగుతూ అడవి జంతువులు, పక్షులను బెదరగొడుతున్నాడు. ఇందుకు గాను భాస్కర్ రెడ్డి రోజుకు రూ.500 చొప్పున నెలకు రూ.15 వేలు చెల్లిస్తున్నాడు.

Tags:    

Similar News