దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు నెట్టబడింది ఆయన వల్లే: మాలోత్ నెహ్రూ నాయక్

దిశ, మరిపెడ: అడ్డుఅదుపు లేకుండా రికార్డు స్థాయిలో విద్యుత్, ఇంధన, నిత్యావసర వస్తువుల- Latest Telugu News

Update: 2022-04-10 10:42 GMT

దిశ, మరిపెడ: అడ్డుఅదుపు లేకుండా రికార్డు స్థాయిలో విద్యుత్, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాలోతు నెహ్రూ నాయక్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెరుగుదలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రజావ్యతిరేక విధానాలు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు నెట్టబడింది అని, తరచూ ధరల పెరుగుదలతో ప్రజలకు మూడు పూటల భోజనం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రయాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయకుండా.. ధరలు పెంచి మోయలేని భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా విద్యుత్ వినియోగదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీని కారణంగా కూరగాయలు, పండ్లు, కిరాణా వస్తువులు, బియ్యం, రోజువారీ ఉపయోగించే ఇతర వస్తువులు ఖరీదైనవిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజల ఆదాయంలో ఏ మాత్రం మెరుగుదల లేదని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో సామాన్య ప్రజలపై మోడీ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోందన్నారు. ధరలను వెంటనే తగ్గించాలి లేకపోతే భవిష్యత్తులో పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News