మహారాష్ట్ర మంత్రి అరెస్ట్‌పై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్‌పై నేషనలిస్ట్ కాంగ్రెస్..latest telugu news
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్‌పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా మాలిక్ రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. 'మాలిక్ అరెస్ట్ రాజకీయ ప్రయోజనాలతో కూడుకున్నది. ఆయన ముస్లిం కావడంతోనే దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయంటున్నారు. మాలిక్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు. దీనిపై మేము పోరాడతాము' అని అన్నారు.
మరోవైపు తాజాగా అరెస్టైన మాజీ ఎన్సీపీ నేత నారయణ్ రాణే రాజీనామా చేసినట్లు వినలేదన్నారు. ప్రధాని ఆదివారం పూణేకు వస్తారని, ఆయనే అన్ని విషయాలు వివరిస్తారని చెప్పారు. మాలిక్ కేసును ఒకలా, రాణేను ఒకలా ట్రీట్ చేస్తున్నారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయంగా ప్రేరేపితమని అర్థమవుతుందని అన్నారు. గత నెల 23న మనీ లాండరింగ్‌తో పాటు, దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.