Jabalpur: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం 8 మంది సజీవ దహనం

8 Patients Burnt Alive at Hospital in Jabalpur| మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జబల్ పూర్ జిల్లాలో న్యూలైఫ్ మల్టీ స్పెషాలిటీ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటల చెలరేగిన ఘటనలో 8 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు

Update: 2022-08-01 12:26 GMT

భోపాల్: 8 Patients Burnt Alive at Hospital in Jabalpur| మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జబల్ పూర్ జిల్లాలో న్యూలైఫ్ మల్టీ స్పెషాలిటీ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటల చెలరేగిన ఘటనలో 8 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. మరణించిన వారిలో ఐదుగురు పేషంట్లతో పాటు ముగ్గురు ఆసుపత్రి ఉన్నారని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా, పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రక్షించడానికి వెళ్లిన సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారని తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలిపారు. ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: బెంగాల్ మంత్రి వర్గంలో మార్పులు

Tags:    

Similar News