Madhavan: నేను అజ్ఞానినే.. విమర్శలపై స్పందించిన మాధవన్
Madhavan Says, I deserve this, after he gets trolled for his panchangam comments at the promotional event of Rocketry: The Nambi Effect| ప్రముఖ స్టార్ హీరో మాధవన్ తనపై వస్తున్న విమర్శలకు తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చాడు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన 'రాకెట్రీ'
దిశ, సినిమా: Madhavan Says, I deserve this, after he gets trolled for his panchangam comments at the promotional event of Rocketry: The Nambi Effect| ప్రముఖ స్టార్ హీరో మాధవన్ తనపై వస్తున్న విమర్శలకు తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చాడు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన 'రాకెట్రీ'.. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. జులై 1న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న హీరో.. 'ఇస్రో పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది.
గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి' అన్న మాధవన్ వీడియో వైరల్ అయింది. దీంతో ట్రోలింగ్ మొదలుపెట్టిన నెటిజన్లు.. 'సైన్స్ అందరికీ అర్థం కాదు. మీరు మాట్లాడిన విషయానికి మీనింగ్ ఉందా?. అసలు విషయం తెలియకపోతే మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటం బెటర్ కదా' అని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రియాక్ట్ అయిన మాధవన్.. 'పంచాంగాన్ని తమిళంలో పంచాంగ్ అనడం పొరపాటే. నేను అజ్ఞానినే. ఓన్లీ 2 ఇంజిన్‌ల సాయంతో మార్స్ మిషన్‌లో విజయం సాధించామనేది నిజం కాకుండా పోదు. ఇది ఒక రికార్డు. వికాస్ ఇంజిన్ ఒక రాక్‌స్టార్' అంటూ మరో ట్వీట్ చేశాడు.
Also Read: సల్మాన్ ఖాన్ పాటకు సమంత రియాక్షన్ ఇదే?
🙏🙏I deserve this for calling the Almanac the "Panchang" in tamil. Very ignorant of me.🙈🙈🙈🤗🚀❤️Though this cannot take away for the fact that what was achieved with just 2 engines by us in the Mars Mission.A record by itself. @NambiNOfficial Vikas engine is a rockstar. 🚀❤️ https://t.co/CsLloHPOwN
— Ranganathan Madhavan (@ActorMadhavan) June 26, 2022