‘లూసిఫర్-2: ఎంపురాన్’ మూవీ నుంచి నటుడి లుక్ రిలీజ్.. అంచనాలను పెంచుతున్న పోస్టర్

మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohanlal), పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లూసిఫర్’ సినిమా 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-16 09:54 GMT

దిశ, సినిమా: మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohanlal), పృథ్వీరాజ్(Prithviraj Sukumaran) కాంబినేషన్‌లో వచ్చిన ‘లూసిఫర్’ (Lucifer)సినిమా 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. దీనికి ‘లూసిఫర్-2 ఎంపురాన్’ (Lucifer-2 Empuraan)పేరుతో తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇందులో టోవినో థామస్(Tovino Thomas), నందు సానియా అయ్యప్పన్, మంజు వారియర్(Manju Warrior) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే లూసిఫర్ నుంచి విడుదలైన మోహన్ లాల్(Mohanlal) ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై హైప్ పెంచింది. తాజాగా, లూసిఫర్-2 నుంచి పృథ్వీరాజ్ లుక్ విడుదల చేశారు మేకర్స్. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో ఖురేషి అబ్రమ్‌కు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Tags:    

Similar News